ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకుడు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్దాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్ట్ని విడుదల చేశారు. భీమ్ రామ్ దొర పాత్రలో రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ అంటూ సందడి చేశారు. జగపతిబాబు, కథాబలం ఉన్న చిత్రమిది. అజయ్ సామ్రాట్ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభిస్తోంది అన్నాయి సినీవర్గాలు. ఫస్ట్లుక్కు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతోష్, నిర్మాత: రసమయి బాలకిషన్.