Namaste NRI

అమెరికాలో భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో  న‌లుగురు భార‌త సంత‌తి వ్య‌క్తులు కిడ్నాప్‌కు గుర‌య్యారు. కాలిఫోర్నియాలో అత్యంత ర‌ద్దీగా ఉండే మెర్సిడ్ కౌంటీలో ఈ కిడ్నాప్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కిడ్నాప్ గురైన వ్య‌క్తులు జ‌స్‌దీప్ సింగ్ (36), అత‌ని భార్య జ‌స్లీన్ కౌర్ (27), వారి కుమార్తె అరూహీ ధేరి (8 నెల‌లు), వారి బంధువు అమ‌న్‌దీప్ సింగ్ (39)గా పోలీసులు గుర్తించారు. కిడ్నాప‌ర్లు మార‌ణాయుధాలు     ధ‌రించి ఉన్నార‌ని స్థానికులు తెలిపారు.  ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేద‌ని, ద‌ర్యాప్తులో అన్ని విష‌యాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు.  అయితే కిడ్నాప‌ర్ ఎవ‌రై ఉంటారు, కిడ్నాప్‌కు కార‌ణం ఏమిటి అనే వివ‌రాల‌ను మాత్రం పోలీసులు వెల్ల‌డించ‌లేదు.  నిందితులుగానీ, బాధితులుగానీ క‌నిపిస్తే వారి ద‌గ్గ‌రికి వెళ్ల‌కూడ‌ద‌ని, వెంట‌నే 911కు కాల్ చేయాల‌ని సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events