Namaste NRI

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు : గుర్రాల నాగరాజు

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించ‌బోతున్న జాతీయ పార్టీకి సౌతాఫ్రికా టీఆర్ఎస్ శాఖ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు గుర్రాల నాగరాజు స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా  నాగ‌రాజు మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా వివిధ వ‌ర్గాల నుంచి అఖండ మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ద‌ని తెలిపారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా కేసీఆర్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నార‌ని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచింద‌న్నారు.  దేశాభివృద్ధి కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు కేసీఆర్  జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఉత్తరాది రాష్ర్టాల్లోని నాయకులే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. . జాతీయ స్థాయిలో కేసీఆర్‌ లాంటి విజన్‌ ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events