ఫిన్లాండ్ తెలుగు సంఘం అక్తోబర్ 2వ తెదిన, ఫిన్లండ్ లొ దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిన్లండ్ లోని అన్ని ప్రాంతాల నుండి నాలుగు వందల మంది హాజరవ్వగా, చిన్నారులు, పెద్దలు ఆట పాటలతో, న్ర్యుత్య ప్రదర్సనలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలుగు వాళ్లతో పాటు, ఫిన్లండ్ లోని ప్రజలు కూడ పాల్గొనడం గమనార్హం.
ఇంతకు ముందు ఫిన్లండ్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో మూదు వందల మంది వరకు హాజరయ్యెవారు అని, కాని ఈ సారి నాలుగు వందలుకి పైన హాజరవ్వడం ఆనందకర విషయమని, మన తెలుగు వాళ్ళు ఫిన్లండ్ కి ఎక్కువ మంది రావడాన్ని తెలియజెస్తున్నదని, ఫిన్లండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాధ్ పార్లపల్లి, సుబ్రమణ్య మూర్తి, జ్యొతిస్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచెర్ల తెలియజెసారు. ఇంత మందితో కలిసి పందుగ చెసుకుంటుంటె మన వూరిలో, మన ఇంటిలో వున్నట్లె అనిపించింది అని, మున్ముందు వెయ్యి మంది పాల్గొనేట్టు పెద్ద కార్యక్రమాల్ని నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు.