సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ యశోద. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు అని చెప్పారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడిరచారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: మణిశర్మ, సంభాషణలు, పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి, దర్శకత్వం: హరి`హరీష్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)