బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తనున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రధానమంత్రి లిజ్ ట్రస్ పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత తీర్మాన ప్రతిని పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు గ్రాహం బ్రాడీకి వారు సమర్పించబోతున్నారు. అయితే అవిశ్వాస ప్రతిపాదనకు ఆయన ఇంకా అంగీకరించలేదని తెలిసింది. అక్టోబరు 31న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ట్రస్ ఆర్థిక వ్యూహమే మిటో తెలిసేంతవరకు వేచి చూడ్దామని అసమ్మతులకు బ్రాడీ సూచించారని వెల్లడిరచారు.
ఆమెను తొలగించి ప్రధానిగా రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు బహిర్గతమైంది. అదే జరిగితే 2016లో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ప్రధాని అర్థంతరంగా పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి కానుంది.