అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గంగూరి శ్రీనాథ్ (32) అమెరికాలో ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదం బారిన పడడంతో మృతిచెందాడు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. గతంలో ఫ్లోరిడాలో ఉన్న ఈ దంపతులు ఆరు నెలల క్రితమే అట్లాంటాకు మారారు. ఆదివారం హాలీడే కావడంతో దంపతులిద్దరూ ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్ వెళ్లారు. అక్కడ ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తూ 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడి చనిపోయాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)