నందమూరి బాలకృష్ణ తన తొలి బ్రాండ్‌కమర్షియల్‌లో వాణిజ్యరంగంలోకి అడుగు పెట్టారు. బాలకృష్ణ తన స్టార్‌డమ్‌కు తగ్గ బ్రాండ్‌ను ఎంచుకున్నారు. సాయి ప్రియాగ్రూప్ వెంచర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు 116 పారమౌంట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమోదం తెలిపారు. కాగా బాలయ్య నటించిన రెండు కమర్షియల్ యాడ్స్ విడుదలయ్యాయి. వీటి కాన్సెప్ట్‌లు యునిక్‌గా ఆకర్షణీయంగా ఉన్నాయి. బాలకృష్ణ రెండు గెటప్‌లలో మెరిశారు. మొదటి యాడ్‌లో బాలయ్య రాయల్ అవతార్‌లో కన్పించగా, రెండో యాడ్‌లో సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కన్పించారు. ఇండియన్స్ ఇల్లు కొనడం చాలా పెద్ద నిర్ణయం. నివాస గృహాన్ని కొనుగోలనేది చాలా భావోద్వేగాలు, సెంటిమెంట్‌తో కూడుకున్నది. రెండవ ప్రకటన ద్వారా ఇదే విషయాన్ని తెలియజేశారు. బాలకృష్ణ తనదైన డైలాగ్ డెలివరీతో చాలా గ్రేస్ పుల్‌గా ఆకట్టుకున్నారు. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయికృష్ణ పాల్గొన్నారు.
