పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. పవన్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. క్రిష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. అన్ని హంగులతో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తునారు. దీంతో వేసవి బాక్సాఫీస్ వద్ద పవన్ సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో త్వరలోనే ప్రకటన రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)