బ్రిటన్ రాజు చార్లెస్`3కి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో రాజ దంపతులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటు చేసుకొంది. ప్రజా సమూహాలతో మాట్లాడేందుకు నడిచివస్తున్న కింగ్ ఛార్లెస్`3, రాణి కెమిల్లాల పైకి ఓ వ్యక్తి మూడు కోడిగుడ్లు విసిరాడు. ఈ గుడ్లు తన మీద పడకుండా 73 ఏళ్ల కింగ్ ఛార్లెస్ త్రుటిలో తప్పించుకున్నారు. పోలీసులు వెంటనే నిందితుణ్ని అదుపులోకి తీసుకోగా, గుమికూడిన జనం అతడిని నిందిస్తూ కేకలు వేశారు. ఈ దేశం బానిసల రక్తం మీద నిర్మితమైంది అంటూ ఆ యువకుడు అరిచాడు. గత సెప్టెంబరులో మృతి చెందిన రాణి ఎలిజబెత్`2 విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఛార్లెస్ దంపతులు యార్క్ షైర్‌కు వచ్చారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ 2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఎలిజిబెత్ మరణం అనంతరం బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్`3 బాధ్యలు చేపట్టారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)