సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వీఆర్‌ఎల్ గ్రూప్ అధినేత విజయ్ శంకేశ్వర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం విజయానంద్. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిఋహాల్ నటించారు. అనంత్‌నాగ్, వినయ్‌ప్రసాద్, వి.రవిచంద్రన్, ప్రకాశ్ బెలవాడి ప్రధాన పాత్రధారులు. రిషికా శర్మ దర్శకుడు. ఆనంద్ శంకేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పూర్తినిచ్చే జీవిత గాథ ఇది. విజయ్ శంకేశ్వర్ ప్రయాణం, ఆయన వ్యాపార దక్షత ఓ పాఠంలా నిలుస్తుంది. భారతదేశంలోనే అతి పెద్ద జీవిత కథా చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. తన తండ్రిపై ఆధారపడకుండా విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ ఓ పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేత ఎలా అయ్యారు? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. డిసెంబర్ 9న తెలుగు, తమిళం, మలయాలంతో పాటు హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)