పోర్న్ సినిమా నిర్మాణాల్లో తనకు ఎటువంటి ప్రేమయమూ లేదని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తెలిపింది. తన భర్త రాజ్ కుంద్రా తీసేది పోర్న్ కాదని కేవలం శృంగార చిత్రాలు అని చెప్పింది. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను ఆరు గంటల పాటు విచారించారు. ఆ విచారణలోనే ఆమె ఈ విషయాలు వెల్లడిరచింది. హాట్ షాట్స్ అనే యాప్‌తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఆమె విరణ ఇచ్చింది. ఆ యాప్‌తో తనకు లావాదేవీలు లేవని, యాప్ లాభాలూ తాను తీసుకోలేదని ఆమె స్పష్టం చేసింది. తన భర్త రాజ్ కుంద్రాకు సంబంధించి పలు విషయాలను శిల్ప వెల్లడిరచింది. తన భర్త పోర్న్ సినిమాలు తీయడని ఆమె చెప్పింది. పోర్న్, శృంగార చిత్రాలు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం ఆమె చెప్పింది. హాట్ షాట్స్‌లో ఉంటే కంటెంట్ ఏమిటో కూడా తనకు తెలియదని శిల్ప చెప్పింది.