సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడుతూ నాకు కామెడీ, లవ్ స్టోరిస్ అనే అవకాశం రావడం లేదేంటే అనుకుంటున్న సమయంలో దక్కిన చిత్రమిది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. మూడు ప్రేమ కథలు కలిపితే ఈ సినిమా. తమన్నాతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె తన కెరీర్లో ఇలాంటి పాత్ర చేయలేదు నిధి క్యారెక్టర్‌ను నేనెంత ప్రేమిస్తానో సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతికి లోనవుతారు. ఒక ఫీల్ గుడ్ లవ్‌స్టోరిని మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ మా సినిమాతో ఈ శీతాకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అలాంటి హత్తుకునే ప్రేమ కథల్ని ఇందులో తెరకెక్కించాం. సంగీతం: సినిమాటోగ్రఫీ, మాటలు ఆకర్షణ అవుతాయి అన్నారు. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సత్యదేవ్, తమన్నా ఇతర నటీనటులంతా తమ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు ఎం. సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
