యూకేలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించాయి. అక్కడ సుమారు వంద కంపెనీలు ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ తీపి కబురును చెప్పాయి. అదికూడా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా, నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని సూచించాయి. వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పని చేస్తున్నారు. 4డే వీక్ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్‌లోని అతిపెద్ద కంపెనీలు అయిన అటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి.