Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనకు…  జెలెన్‌స్కీ స్ట్రాంగ్‌ కౌంటర్‌  

ఉక్రెయిన్‌పై రష్యా  భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌  ఓ ప్రతిపాదన చేశారు. మాస్కో ఆక్రమిత ఉక్రేనియన్‌ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, క్రిమియన్‌ ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించటం, ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇవ్వడం వంటి శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అదికాస్త వివాదానికి దారి తీసింది.  తాజాగా మాస్క్‌ ప్రతిపాదనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..  తమ దేశం వచ్చి అక్కడి పరిస్థితులను గమనించాక మాట్లాడాలని స్పష్టం చేశారు.  ఆయనను కొందరు ప్రభావితం చేసి ఉండొచ్చు. లేదా ఆయనే స్వతహాగా ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నా.. రష్యా చేసిన మారణాకాండను అర్థం చేసుకోవాలనుకుంటే ఉక్రెయిన్‌ వచ్చి సొంతంగా పరిస్థితులను పరిశీలించాలి.  ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే విషయాన్ని సూచించారు. ఈ యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఎవరు ముగించాలని అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events