జాత్యహంకార ధోరణి ఎప్పుడు, ఎక్కడ ఎదురైనా తప్పనిసరిగా ఎదురించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. బాల్యంలో తాను కూడా జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని, అయితే ఇప్పుడు దేశం పురోగమించిందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. అయితే బ్రిటన్ రాజ కుటుంబంలో జాత్యహంకార ధోరణి వెలుగుచూసిన నేపథ్యంలో ప్రధాని సునాక్ స్పందించారు. అయితే ఆ ఘటన గురించి కానీ సునాక్ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. జాత్యహంకారాన్ని ఎదుర్కోవడంలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, అయితే దాన్ని నిర్మూలించే పని ఇంకా పూర్తి కాలేదని రిషి సునాక్ చెప్పారు. అందుకే అది ఎప్పుడు కనిపించినా ఎదిరించాలన్నారు. ప్రిన్స్ విలియం గాడ్ మదర్ లేడీ సుసాన్ హసీ జాత్యహంకార ధోరణి ప్రదర్శించారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఆమె ఓ ఆఫ్రికన్‌తో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే రిషి తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు.