కువైత్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్‌ను బ్యాన్ చేసింది. ఓ ఎలిమెంటరీ విద్యార్థి తోటి విద్యార్థిపై మెటల్ థర్మోస్తో దాడికి పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడట. ఈ ఘటన నేపథ్యంలోనే విద్యామంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట అబ్బాయిలకు మాత్రమే ఇలా ఈ వాటర్ బాటిళ్లను స్కూళ్లకు తీసుకురావడాన్ని అధికారులు నిషేధించారు. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని విద్యార్థులందరికీ (అబ్బాయిలు, అమ్మాయిలకి కూడా) అమలు చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశించింది.