హ్వార్వర్డ్ యూనివర్సిటీ నూతన ప్రెసిడెంట్‌గా ఓ నల్లజాతీయురాలు నియమితులయ్యారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. హైతీ వలసదారుల కుమార్తె అయిన 52 ఏండ్ల గే వచ్చే ఏడాది జూలై 1న అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆమె వర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్‌గా పనిచేస్తున్నారు. 2018లో డీన్‌గా నియమితులైన క్లాడిన్ కరోనా కష్టకాలంలోనూ సమర్థవంతంగా తన బాధ్యలు నిర్వహించారు. హార్వర్డ్ ప్రెసిడెంట్‌గా తనను ఎంపికచేయడం పట్ల ఆమె ఆనందం వ్యక్తంచేశారు. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా రికార్డు సృష్టించారు. కాగా, మసాచుసెట్స్‌లో ఉన్న కేంబ్రిడ్జ్ స్కూల్‌కు అధిపతిగా ఎన్నికైన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు.