గూగుల్ సెర్చ్‌లో నవంబర్ వన్ సౌత్ హీరోయిన్‌గా చందమామ కాగజల్ అగర్వాల్ రికార్డు క్రియేట్ చేశారు. 2022లో గూగుల్ సెర్చ్ లో టాప్ 10లో సౌత్ కథానాయికల జాబితాలో కాజల్ అగర్వాల్, సమంత, రష్మిక, తమన్నా, నయనతార, అనుష్క, పూజా హెగ్డే, కీర్తిసురేష్, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ మొదటి పది స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సౌత్ భామల్లో నంబర్ వన్ స్థానంలో చందమామ కాజల్ అగార్వాల్ నిలిచింది. దీనికి చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఆచార్య సినిమాలో హాట్ టాపిక్‌గా మారింది. కాజల్ ఈ మూవీ నుంచి వైదొలగటంపై మెగా అభిమానుల్లో ఎక్కువ చర్చకు దారితీసింది కూడా. తర్వాత ఇదే ఏడాది అమె ప్రేమించిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని పెళ్లాడి పండండి బిడ్డకు జన్మనిచ్చింది. కెరీర్ కంటే ఇలాంటి వ్యక్తిగత విషయాలతో గూగుల్‌లో ట్రెండ్ అయ్యింది. తర్వాత సమంత గురించి ఎక్కువ గూగుల్‌లో సెర్చ్ చేశారు.