ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ జంటగా నటించిన చిత్రం బలగం. డీఆర్‌పీ (దిల్‌రాజు ప్రొడక్షన్స్) పతాకంపై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు వేణు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డీపీఆర్ బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ నిర్మాతలుగా హర్షిత్, హన్షితలకు ఈ సినిమా శుభారంభాన్నిస్తుందన్న నమ్మకం ఉంది. బొమ్మరిల్లు, శతమానం భవతి చిత్రాలు ఈ సంస్థకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి పేరు తీసుకొచ్చాయి. బలగం సినిమా అదే తరహాలో మెప్పిస్తుంది అన్నారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ తెలంగాణ నేపథ్య కథ ఇది. సిరిసిల్లలో షూటింగ్ చేశాం. వినోదంతో పాటు భావోద్వేగాల్ని పంచుతుంది అని తెలిపారు. దర్శకుడు వేణు ప్రతిబను ఆవిష్కరించే చిత్రమిదని ప్రియదర్శి అన్నారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తూ కొత్త కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ బ్యానర్‌ను ఆరంభించామని నిర్మాత హన్షిత రెడ్డి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)