వెంకట్ కిరణ్ శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ఎర్రగుడి. అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ అనేది ఉప శీర్షిక. దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్నారు. ఆదిత్యం ఓం, రఘు బాబు, అంజయ్ ఘోష్, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమ కథ ఇది. లవ్, సెంటిమెంట్, దైవిక అంశాలుంటాయి. 1975 నుంచి 1992 మధ్య కాలంలో జరుగుతుంది. షూటింగ్ మొత్తం వచ్చే మార్చి కల్లా పూర్తిచేస్తాం అన్నారు. నిర్మాణ సారథి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా చేస్తాం నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ఎన్ హరీష్, సంగీతం : మాధవ్ సైబా, రామ్ సుధి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)