చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో హీరో రవి తేజ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటను విడుదల చేశారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించి స్వరపర్చారు. జన్‌ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్ పాడారు. యూరప్‌లో చిత్రీకరించిన ఆ పాట లొకేసన్స్, చిరంజీవి శృతి హాసన్ డాన్స్ మూవ్‌మెంట్స్ సినిమాలో ఆకర్షణ అవుతాయని చిత్ర బృందం చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)