గుడివాడ లో తానా చైతన్య స్రవంతి కార్య క్రమం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ,Eye క్యాంప్, ENT క్యాంప్ , కాన్సెర్ క్యాంప్ నిర్వహించారు. శ్రీ శశికాంత్ వల్లేపల్లి , వారి తండ్రి, శ్రీ వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు గారు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ – రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి 850,000 రూపాయల వ్యయం తో వైకుంఠ రథం బహూకరించారు.
స్కూల్ విద్యార్దిని లకు తానా చేయూత ద్వారా 55 మంది కి స్కాలర్ షిప్ లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్ లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ బహూకరించారు. ముఖ్య అతిథిగా శ్రీ కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి, గౌరవ అతిథులుగా గా శ్రీ రావి వెంకటేశ్వర రావు గారు, శ్రీ వర్ల కుమార్ రాజ గారు, రోటరీ క్లబ్ గుడివాడ వారు పాల్గొన్నారు.
శ్రీ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికా లో ఎవరి పనులు వారు చేసుకొంటూ, ఉద్యోగాలలో ఎదుగుతూ ఇంత పెద్ద స్థాయి లో సహాయ సహకారాలు అందిస్తున్నారు . వారికి ఇక్కడ వున్న మనం కూడా మన వంతు సపోర్ట్ ఇవ్వాలి అని సూచించారు.శ్రీ అంజయ్య చౌదరి, తానా అధ్యక్షులు మాట్లాడుతూ తానా చేస్తున్న అనేక సహాయ కార్య క్రమాలు వివరించారు. 2 డిసెంబర్ నుంచి 4 జనవరి వరకు జరిగే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో జరిగే సేవా కార్యక్రమాలు వివరించారు.
శ్రీ వేంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ద్వారా ప్రతి సేవా కార్యక్రమానికి టార్గెట్స్ పెట్టుకొని వాటిని అధికమిస్తున్నామని చెప్పారు.