Namaste NRI

వలసదారులకు సౌదీ అరేబియా  షాక్‌!

కువైత్  బాటలోనే సౌదీ అరేబియా పయనిస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా తాజాగా సౌదీ ముందడుగు వేసింది. ఉద్యోగాల్లో స్థానికీకరణను సౌదీ ప్రారంభించిన అరబ్ దేశం మొదటి దశలో కింగ్‌డమ్‌లోని అన్ని ప్రాంతాలలో ఉన్న పోస్టల్, పార్శిల్ సర్వీసులకు  దీన్ని అమలు చేస్తున్నట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. కంపెనీలు, వ్యాపారాలకు ఇచ్చిన లోకలైజేషన్ గ్రేస్ పీరియడ్ గడువు ముగిసిందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. పోస్టల్, పార్శిల్‌లో 14 సర్వీసులను వంద శాతం సౌదీసీకరణ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. హడాఫ్‌గా పేర్కొనే సౌదీ మానవవనరుల అభివృద్ధి నిధుల ద్వారా రిక్రూట్‌మెంట్, సౌదీ జాతీయీకరణ పథకం  సపోర్ట్ ప్రోగ్రామ్‌లకు యాక్సెస్ పొందేందుకు ఈ ప్యాకేజీ మద్దతు ఇస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events