ద్వైపాక్షిక చర్చల్లో అమెరికాపై చైనా ఎదురుదాడి ప్రారంభించింది. సంబంధాల్లో ప్రతిష్ఠంభన తొలగాలంటే కొన్ని డిమాండ్లను ఆమోదించాలంటూ షరతులు పెట్టింది. సముద్ర తీర నగరమైన తియాంజిన్‌లో చైనా ఉప విదేశాంగ మంత్రి షియే ఫెంగ్, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ వెండీ షెర్మన్‌ల మధ్య జరిగిన చర్చల్లో ఈ పరిస్థితి కనిపించింది. కరోనా కారణంగా రాజధాని బీజింగ్‌కు విదేశీయులను ఎవర్నీ అనుమతించకపోవడంతో తియాంజిన్‌లో చర్చలు జరిగాయి. అమెరికా చేస్తున్న తప్పుడు పనులు అంటూ ఒక జాబితాను, చైనాకు ఆందోళన కలిగిస్తున్న కొన్ని సంఘటనలు అంటూ మరో జాబితాను అందించింది. చైనా అధికారులు, వారి కుటుంబ సభ్యులపై విధించిన వీసా ఆంక్షలు ఎత్తివేయాలని, హువావే కంపెనీ సీఎఫ్‌ఓ మెంగ్ వాంరaౌవ్‌ను అప్పగించాలంటూ కెనడాకు పంపిన వివనతిని ఉపసంహరించాలని, చైనా కంపెనీల అణచివేతను నిలిపివేయాలంటూ ఆ జాబితాల్లో పేర్కొంది.