చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. ఈ యాప్‌ను తమ చట్టసభల డివైజ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. . ఇప్పటికే అమెరికాలోని టెక్సాస్, జార్జియా, మేరీలాండ్, సౌత్ డకోటా తదితర రాష్ట్రాలు తమ ప్రభుత్వ డివైజ్‌ల్లోని టిక్‌టాక్‌ను నిషేధించాయి. దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో మాత్రమే వినియోగించకూడదని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై చట్టసభల సిబ్బంది హౌస్ డివైజెస్‌లో టిక్‌టాక్‌ను వాడకూడదని ఆదేశించింది. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా తమ మొబైల్స్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.