చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి. చైనా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) స్పష్టం చేసింది. ప్రయాణానికి రెండు రోజుల మందు ప్రీ డిపార్చర్ టెస్ట్ (పీడీటీ)ను తప్పనిసరి చేసింది. ఈ ఆంక్షలు జనవరి 5 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్, మలేషియాలు నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తమ దేశాల్లోకి అనుమతిస్తామని ప్రకటించాయి. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కూడా వాటి సరసన చేరింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)