Skip to main content

Namaste NRI

పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది

తిరువీర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవంతుడు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. జీజీ విహారి దర్శకుడు. రవి పనస ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరోలు విశ్వక్‌సేన్‌, సందీప్‌కిషన్‌ ఆవిష్కరించారు. పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇదని, రొమాంటిక్‌ పీరియాడిక్‌ పొలిటికల్‌ డ్రామాగా మెప్పిస్తుంద ని, సమాజంలోని వైరుధ్యాలను, సామాజిక అంతరాలను చర్చించే సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కథ విన్నప్పుడు అసురన్‌, కర్ణన్‌, జైభీమ్‌ వంటి సినిమాలు గుర్తొచ్చాయని, ఏప్రిల్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామ ని నిర్మాత రవి పనస తెలిపారు. విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తన పాత్ర కొత్తగా ఉంటుందని హీరో తిరువీర్‌ అన్నారు. ఈ వేసవిలో విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: కేపీ, కథ, దర్శకత్వం: జీజీ విహారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events