Namaste NRI

అమెరికా కంపెనీ వినూత్న ఆలోచన…

అమెరికాలోని ఆస్టిన్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఓ వినూత్న ఐడియాను రచించింది. చనిపోయిన వారి చితాభస్మంతో ధగధగలాడే వజ్రాలను ఆ కంపెనీ తయారు చేస్తున్నది. ఎటెర్నవా అనే స్టార్టప్‌ కంపెనీ అస్థికలతో డైమండ్స్‌ రూపొందిస్తున్నది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ కంపెనీకి మంచి గుర్తింపు వచ్చింది. కరోనా వేళ తమ ఆత్మీయులు మరణిస్తే, చాలా మంది అస్థికలను కూడా సేకరించుకోలేకపోయారు. అలాంటి వారికి ఎటెర్నవా లాంటి కంపెనీలు వజ్రాల రింగులతో మధుర జ్ఞపకాలను అందిస్తున్నాయి. నాలుగేళ్ల ఈ స్టార్టప్‌ కంపెనీ చనిపోయినవారి భస్మాన్ని లేదా వెంట్రుకలు నుంచి భిన్న పద్ధతిలో డైమండ్స్‌ రూపొందిస్తున్నది. డైమండ్‌కు ఎక్కువ కాలం మెరిసే లక్షణాలు ఉన్న నేపథ్యంలో వాటిని రూపొందించడంపైనే ఆ కంపెనీ దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లలో వెయ్యి మంది కస్టమర్లకు 1500 డైమండ్లను తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీ 10 మిలియన్ల డాలర్ల సంస్థగా ఎదిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress