టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో ఉన్న టెస్లా కంపెనీ చీఫ్ టామ్ జూకు అత్యున్నత ఎగ్జిక్యూటివ్ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు యూరోప్‌లో ప్లాంట్లలో ఉత్పత్తుల్ని చూసుకునేందుకు టామ్ జూకు పదోన్నతి కల్పించినట్లు కంపెనీ రిపోర్టులో తెలింది. కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్ తర్వాత టామ్ జూ ఇప్పుడు కీలక ఎగ్జిక్యూటివ్ పోస్టులో కొనసాగనున్నారు. చైనాలోని టెస్లాకు జూనే వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నారు. ఇక ఆసియా దేశాల్లో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఆయనే ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. బలమైన ఎగ్జిక్యూటివ్ టీమ్ ఉండాలని ఇన్వెస్టర్లు ఇచ్చిన పిలుపు మేరకు మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.