నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దీన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్‌ని ప్రారంభించారు మేకర్స్. లీడ్ యాక్టర్స్ అంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నారు. దీంతో షూట్ మొత్తం పూర్తవుతుంది.
ఇందులో చైతూ ఫెరోషియస్ గెటప్‌లో కనిపించనున్నాడు. న్యూ ఇయర్‌కి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం.
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అద్భుతమైన సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్‌ఆర్ కత్తిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కానుంది.