అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులమోత మోగింది. ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో ఫ్రెంచ్ ర్యాపర్ మోంటనా, రాబ్49 అక్కడ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో ర్యాపర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లోని పార్కింగ్ ప్లేస్లో ఓ వ్యక్తి తుపాకీతో 15 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తూటాల శబ్దం విని జనం పరుగులు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 10 మందికి తూటాలు తగిలినట్లు సమాచారం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)