Namaste NRI

వీరసింహా రెడ్డి చరిత్రలో నిలిచిపోతుంది: బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహా రెడ్డి. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా  బాలకృష్ణ మాట్లాడుతూ  ఒక సినిమాలో అన్నీ సరిగ్గా కుదిరితే అది బాక్సాఫీస్ దగ్గర విస్పోటనం లాంటి విజయాన్ని అందిస్తుంది. అలాంటి చిత్రమే  వీరసింహా రెడ్డి. నా కెరీర్ లో ఇదొక గుర్తుండిపోయే సినిమాగా మారుతుందన్న నమ్మకం ఉంది. ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనం అందించే ప్రయత్నం చేయాలనేది నా కోరిక. ఇదే దారిలో నా నట ప్రయాణం సాగిస్తా అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ  ఒక అభిమానిగా బాలకృష్ణతో సినిమా రూపొందించాను. ఆయన్ను తెరపై ఎలా చూడాలని కోరుకుంటామో అలా అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా ఉంటుంది అన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ మేం సినిమాను ఇప్పటికే చూశాం. మీ అందరి అంచనాలు మించేలా సినిమా వచ్చింది. చిత్ర విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.  ఈ నెల 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.  ఈ కార్యక్రమంలో నాయిక శృతి హాసన్, నటులు దూనియా విజయ్, సప్తగిరి, అజయ్ ఘోష్, స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events