బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ కన్వీనర్ మహేశ్ బిగాల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మహేశ్ బిగాలతో మేయర్ చర్చించారు. మేయర్ అమెరికాలో పర్యటన సందర్భంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్‌తో భేటీ కానున్నారు. అక్కడ ఇండియన్ డియాస్పోరాతో భేటీ కానున్నారు. న్యూయార్క్, నార్త్ కరోలినా, టెన్నెసీలో పర్యటించనున్నారు. కొద్ది రోజుల్లో పూర్తి పర్యటన వివరాలను వెల్లడిస్తామని మహేశ్ బిగాల తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)