నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మాస్ మొగుడు సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్. ఎస్ థమన్ కంపోజిషన్ లో ఈ పాట మాస్ బీట్తో సాగుతున్న ఈ పాటను మనో, రమ్య బెహరా పాడారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.
కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్కుమార్, హనీ రోజ్, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రికా రవి స్పెషల్ సాంగ్లో మెరవనుంది. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్, సాంగ్స్కు అద్బుతమైన స్పందన వస్తోంది. వీరసింహారెడ్డి జనవరి 12న థియేటర్లలో సంక్రాంతి కానుకగా సందడి చేయనున్నాడు.