తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. అమెరికాలోని న్యూ జెర్సీలోని టీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికాలో శ్రీనివాస్ గనెగొని, రవి ధన్నపనేని, శ్రీనివాస్ గన్గొని, భగవాన్ పింగ్లే, రవి తోట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ముక్కోటి వృక్షార్చనకు సంఫీుభావంగా అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శాఖలు మొక్కలు నాటి మద్దతు తెలిపారన్నారు. న్యూజెర్సీలో ఉన్న కేటీఆర్ మిత్రులు మాట్లాడుతూ కేటీఆర్ న్యూజెర్సీలోనే ఉండే వారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణని ప్రపంచ పటంలో పెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో వీడియో కాల్‌లో గండ్ర రమణారెడ్డి (ఎమ్మెల్యే భూపాలపల్లి), చల్ల ధర్మా రెడ్డి, లింగంపల్లి కిషన్ రావు (ఆగ్రో చైర్మన్), రగురి జయపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ పరకాల సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసినందుకు మహేష్ బిగాల నిర్వాహకులను అభినందించారు.