Namaste NRI

నాని చేతుల మీదుగా హర్  టీజర్

హీరోయిన్  రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హర్. ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీధర్ స్వరగావ్ రూపొందిస్తున్నారు. డబుల్ అప్ మీడియా పతాకంపై రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను హీరో నాని విడుదల చేశారు. సస్పెండ్ అయిన ఆరు నెలల తర్వాత తిరిగి డ్యూటీలో చేరిన లేడీ పోలీస్ ఆఫీసర్ ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం టీజర్లో ఆసక్తికరంగా చూపించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు.  ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో హర్ ఛాప్టర్ 1 పేరుతో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events