తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్‌తో 2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానున్నదని అన్నారు. ఖమ్మం సభ సక్సెస్ తో నిరూపితమైందని ఆయన వెల్లడించారు. దేశంలో బీఆర్‌ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారిపక్షాన ప్రజలు నిలబడతారనేది కేసీఆర్ నమ్మిన సిద్ధాంతమని వెల్లడించారు. ప్రజా సంక్షేమం విషయంలో పేద ప్రజల స్థితిని, దేశ ఆర్థికవ్యవస్థను మార్చడానికి కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారని దేశం ప్రగాఢంగా విశ్వసిస్తుందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ఎజెండాను వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు బీఆర్‌ఎస్ ఆవశ్యకతను ఆన్‌లైన్‌లో వివరించి చైతన్యం తీసుకువస్తామని చెప్పారు.కాంగ్రెస్, బీజేపీల పాలనలో దేశం గాఢాంధకారంలోకి నెట్టివేయబడిందని వెల్లడించారు. తెలంగాణ పథకాలే బీఆర్‌ఎస్ అస్త్రాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)