Namaste NRI

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ

అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్గా డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు అరుణా మిల్లర్(58) చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ హౌస్ మాజీ డెలిగేట్ అయిన ఆమె మేరీల్యాండ్ 10వ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రారంభ ఉపన్యాసంలో అరుణ మాట్లాడుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియాలో జరిగిన తన బాల్యమంతా తల్లిదండ్రులు దగ్గర లేరన్న బెంగతోనే గడిచిందన్నారు. తన తండ్రి, తోబట్టువులు, అమ్మమ్మ కూడా పరాయి వారే అయిపోయారని అన్నారు. కాబట్టే ఇండియాలో గడిచిన అప్పటి విషయాలు తనకు గుర్తు లేవన్నారు. పురుషాధిపత్యం ఉన్న సమాజంలో మహిళా ఇంజినీరుగా, తనలాంటి వారు ఎవరూ లేని సభలో ఇండియన్-అమెరికన్ శాసనకర్తగా పనిచేశానని అన్నారు. తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపారు.  అమెరికాలోని రాష్ర్టాల్లో గవర్నర్ తర్వాత అత్యున్నత పదవి లెఫ్టినెంట్ గవర్నర్. అరుణకు ఏడాది వయసు ఉన్నప్పుడు వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events