మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. వేదాళమ్ రీమేక్గా వస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్ నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సినిమా షూటింగ్ను రీస్టార్ట్ చేశాడు చిరు. హైదరాబాద్లోని పెద్దమ్మ టెంపుల్లో భోళా శంకర్ షూటింగ్ మొదలైనట్టు మెహర్ రమేశ్ ఇప్పటికే ఓ అప్డేట్ కూడా ఇచ్చేశాడు. డైరెక్టర్ మెహర్ రమేశ్ అండ్ టీం సెట్స్ లోకి చిరుకు ఘనస్వాగతం పలికింది. అనంతరం భోళా శంకర్ పోస్టర్ ముందు డైరెక్టర్ అండ్ టీం సమక్షంలో కేక్ కట్ చేశాడు చిరంజీవి. ఈ సందర్భంగా టీంకు ధన్యవాదాలు తెలియజేశాడు చిరు.ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. భోళా శంకర్లోలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.