Namaste NRI

అమిగోస్ నుంచి యెక యెక..లిరికల్ సాంగ్ రిలీజ్

కళ్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అమిగోస్. అషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నది. ఆమె తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి యెక యెక అనే లిరికల్ గీతాన్ని విడుదల చేశారు. జిబ్రాన్ స్వరపర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. ఒకే రూపముండి ఒకరికొకరు పరిచయం లేని ముగ్గురు వ్యక్తులు మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపేలా సాగిందీ పాట. ఈ మూడు పాత్రలను కళ్యాణ్ రామ్ పోషించడం విశేషం. ఈ ముగ్గురు ఒకే పోలికల్లో ఎందుకున్నారు. అలాంటి ముగ్గురు అమిగోస్ (అమిగోస్ అంటే స్నేహితుడిని పిలిచే స్పానిష్ పదం) ఎంత సంతోషంగా ఉన్నారు,  ఈ పోలికలు వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాయి ఆసక్తికరంగా చెబుతున్నారు చిత్రబృందం. ప్రపంచవ వ్యాప్తంగా  ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events