భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్టు సంకేతాలిచ్చారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? రెండోది, కొత్త లీడర్ తానేనా? అన్నది చూడాలి. అవును. ప్రస్తుతం కొత్త నాయకత్వం అవసరం. నేనే ఆ కొత్త లీడర్ కావొచ్చు్ణ అని ఆమె పేర్కొన్నారు. బైడెన్కు మరో అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు మాజీ గవర్నర్గా, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగాను సేవలందించారు. అయితే 2018 అక్టోబర్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రంగా నుంచి బయటకు వచ్చారు. గవర్నర్గా, రాయబారిగా ఉత్తమ సేవలు అందించినట్టు చెప్పిన ఆమె అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి సిద్ధమేనన్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 5, 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.