కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న బుట్టబొమ్మ ట్రైలర్ను మేకర్స్ లాంఛ్ చేశారు. అరకు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఆటోడ్రైవర్ పాత్రలో సూర్యవశిష్ఠ నటిస్తుండగా, కాలేజీ యువతి పాత్రలో అనిఖా సురేంద్రన్ కనిపించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్లో అర్జున్ దాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన బుట్టబొమ్మ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ, మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన వినోదంలో, కథేముందో పాటకు మంచి స్పందన వస్తోంది. బుట్టబొమ్మ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.