కథానాయిక హన్సికతో సింగిల్ క్యారెక్టర్తో రాజు దుస్సా తెరకెక్కిస్తున్న చిత్రం వన్ నాట్ ఫైవ్ మినిట్స్. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రమిది. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్తో రూపొందిస్తున్న చిత్రమిది. ఒక గంటా నలభై అయిదు నిమిషాల పాటు సాగే ఉత్కంఠభరితమైన కథ ఇది. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో వన్ నాట్ ఫైవ్ మినిట్స్ చిత్రం రూపొందించబడింది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశంలోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. సింగిల్ క్యారెక్టర్తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక అద్భుతంగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.
