తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ ల మంత్రి కేటీఆర్‌కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుమార్తెలు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని బహూకరించారు. శాంత నారాయణ్‌గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షిత కేటీఆర్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రపటాన్ని బహుకరించారు. ఇద్దరు ప్రముఖ శిల్పులు మూడు నెలలపాటు శ్రమించి అద్భుతమైన పంచలోహ చిత్రపటాన్ని రూపొందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.