రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర్ణ. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి. టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో తీసిన ఓ పాటతో షూటింగ్ పూర్తయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ, మేఘా ఆకాష్‌లపై పాటను తెరకెక్కించారు. సుశాంత్ విలన్‌గా కనిపించనుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ, మాటలు రాశాడు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయబోతున్నట్టు రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.