Namaste NRI

టీడీపీ గెలుపు కోసం ప్రవాస భారతీయులు కృషి చేయాలి

తెలుగుదేశం పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువగళం పాదయాత్రకు మద్దతుగా తెలుగుదేశం సింగపూర్ శాఖ రూపొందించిన తెలుగుదేశం గెలుస్తోంది రా పాటను తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, ఎన్ఆర్ఐ టీడీపీ  వేమూరి రవి కుమార్, ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టభద్రుల  ఎమ్మెల్సీ  అభ్యర్ది డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా వర్చువల్‌గా  విడుదల చేశారు.

ఈ సంధర్భంగా డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ మార్చి 13న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు తమకు తెలిసిన వారితో ఓట్లు వేయించి టీడీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. రాధాకృష్ణ ప్రసంగిస్తూ రాష్ట్రంలో అరాచక పాలన పోయి మళ్లీ చంద్రబాబు పాలన రావాలని, అందుకోసం ఎన్.ఆర్.ఐలు తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ వేమూరి రవి మాట్లాడుతూ తెలుగుదేశం గెలుపు కోసం ప్రవాస భారతీయులు పోషించాల్సిన పాత్ర గురించి వివరించారు. తెలుగుదేశం గెలుస్తోంది రా పాటకు పని చేసిన సాంకేతిక బృందం సభ్యులు వంశీ, చందు, విజువల్స్ వివరాలు తెలియచేశారు. తెలుగుదేశం గెలుస్తోంది రా పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు టీడీపీ సింగపూర్ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 200మందికి పైగా అభిమానులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events