అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్తా అధ్యక్షుడు ఉదయ భాస్కర్ కొట్టే తెలిపారు. ఆప్తా నూతన కార్యవర్గం అట్లాంటాలో సమావేశమై 2023-2024 రోడ్ మ్యాప్‌పై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అట్లాంటాలో పలు వేదికలను నిర్వాహకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయ భాస్కర్ మాట్లాడుతూ సెప్టెంబరు చివరి వారంలో నిర్వహించే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, సాహిత్య కళాకారులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు చైర్‌పర్సన్ సుబ్బు కోట, ఆప్తా పూర్వ అధ్యక్షులు, ఇతర బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అట్లాంటా ఆప్తా ప్రముఖులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)