అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్ రేటు అధికంగా నమోదవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్‌లకు 45 వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.