Namaste NRI

మామా మశ్చీంద్ర  సుధీర్ బాబు డీజే లుక్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం మామా మశ్చీంద్రా.  కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై  సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.   ప్రముఖ కమెడియన్, అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్న గెటప్స్‌లో  కనిపించనున్నాడు. రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ కాగా, వాటికి విశేష స్పందన వచ్చింది. కాగా చిత్రబృందం తాజాగా మూడో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను  విడుదల చేసింది. డీజేగా సుధీర్‌బాబు  లుక్ అదిరిపోయింది. డీజే లుక్‌లో సుధీర్ అల్ట్రా స్టైలిష్‌గా  కనిపిస్తున్నాడు. ఇక ఈ మూడు పాత్రలతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events